రాబందులు
రైతు భూమిలో
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్ ్సలో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు
ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
● టీడీపీ నాయకులే పాత్రధారులు
● అడంగల్ సృష్టించి బినామీ పేర్లతో అమ్మకం
● ఆర్డీఓ రాకతో వెలుగులోకి కుంభకోణం
● తహసీల్దార్ కార్యాలయం వద్ద
బాలకృష్ణాపురం రైతుల ఆందోళన
ఇచ్ఛాపురం రూరల్:
చదువు లేని వారి అమాయకత్వాన్ని ఆ గ్రామ సర్పంచ్ అలుసుగా తీసుకున్నాడు. డాక్యుమెంట్లు చదవలేని వారి బలహీనతను అదనుగా చేసుకుని మరో ఇద్దరితో కలిసి ఏకంగా ఆ రైతు ల భూములకే ఎసరు పెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా విశాఖపట్నంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూములు విక్రయించేశాడు. విషయం తెలుసుకున్న రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 45, 46లో నాలుగు ఎకరాల 65 సెంట్లు వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా మార్చుకునేందుకు అధికారులకు దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తు మేరకు ఆ భూమిని పరిశీలించేందుకు పలాస ఆర్డీఓ జి.వెంకటేష్, స్థానిక తహసీల్దార్ కె.వెంకటరావులు శనివారం బాలకృష్ణాపురం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామ రైతులు ఈ భూములు తమ తాతలు, ముత్తాతల నుంచి సాగు చేస్తున్న పంట భూములని, ఇతరులకు సంబంధం లేదంటూ విన్నవించారు. విశాఖపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాండ్రేగుల సంజీవ్ కుమార్‌కు బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన నూకల దాలమ్మ, ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఆశి సోమేశ్వరరావురెడ్డి, కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన బెందాళం జయప్రకాశ్‌లు భూములు అమ్మినట్లు రిజిస్టేషన్ అయిన నేపథ్యంలో ‘నాలా కన్వర్షన్’ కోసం వచ్చినట్లు ఆర్డీఓ వెంకటేష్ చెప్పడంతో రైతులంతా హతాశుతులయ్యారు. ఇవి తమ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధం లేదని రైతులు ఆర్డీఓ ఎదుట ఆందోళన చేయడంతో ఆయన వెనుదిరిగారు. తర్వాత బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు నూకల దాలమ్మను స్థానిక రైతులు ఆదివారం నిలదీయగా అసలు విషయం బట్టబయలైంది. తనకు సెంటు భూమి లేదని, స్థానిక సర్పంచ్ బతకల కుమారి వచ్చి ‘మాకు చెందిన ఎకరం భూమి నీ పేరున తప్పుగా నమోదైంది. ఇచ్ఛాపురం వచ్చి సంతకం చేయాలి’ అని చెప్పడంతో తాను వెళ్లి సంతకం చేశానని, అందుకు రేషన్ డీలర్ బోరుబద్ర లోహిదాసు, మండపల్లి కాన్వెంట్ ప్రిన్సిపాల్ కోట రామారావులు కూడా చెప్పారని, అంతకంటే తనకు ఏమీ తెలియదని చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. సోమవారం గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములు వెంటనే తమకు అప్పగించాలని తహసీల్దార్ ఎన్.వెంకటరావుకు వినతి పత్రం అందజేశారు.
నా చేత సంతకం పెట్టించారు
నాకు ఏ పాపం తెలియదు. నాకు సెంటు భూమి కూడా లేదు. చదువుకోలేదు. ఇచ్ఛాపురంలో అరటి పండ్లు అమ్ముకొని బతుకుతున్నాను. ఒకరోజు మా సర్పంచ్ వచ్చి తన భూమి నా పేరున మారిందని, వచ్చి సంతకం చేయమంటే చేశాను. ఇప్పుడు నేనే వాళ్లకి ఎకరం భూమి అమ్మినట్లు అధికారులు చెబుతున్నారు. నాచేత సర్పంచ్, రేషన్ డీలర్ కోట రామారావులు ఇదంతా చేయించారు.
– నూకాల దాలమ్మ, బాలకృష్ణాపురం
●
ఉన్నతాధికారుల
దృష్టికి
తీసుకువెళ్తా..
Comments
Please login to add a commentAdd a comment