ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం
భువనగిరి : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ ఆఫీసర్ సి.రమణి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 68వ ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడుతాయని చెప్పారు. అనంతరం జెండా ఊపి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి, అర్గనైజింగ్ సెక్రటరీ ఇందిర, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ బాలకృష్ణ, పీడీ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అథ్లెటిక్స్ పోటీల్లోని 1500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో కె.శివాని, జి.స్పందన, ఎస్.సంధ్య, ఎం సాగరిక, బాలుర విభాగంలో వి.చంద్రశేఖర్, జి.మధుకర్, ఎం.ప్రమోద్, డి.ప్రవీన్ గెలుపొందారు. 400 మీటర్ల పరుగు పోటీల్లో బాలికల విభాగంలో బి.దేవిశ్రీ, డి.సంజన, జి.ఆకాంక్ష, ఎం.మౌనిక, బాలుర విభాగంలో ఎస్.రాము, ఎన్.నవీన్, కె.శివ గెలుపొందారు. డిస్కస్ త్రోలోని బాలికల విభాగంలో కె.నందిని, ఎన్.ప్రణతీ, ఉదయ్‌శ్రీ, బాలుర విభాగంలో ఎం.రాహుల్, వి.వినోద్ కుమార్, ఎస్.అక్షయ్, జావలిన్ త్రోలో బాలికల విభాగంలో హరిక, రాజేశ్వరీ, ప్రణతి గెలుపొందారు.
డీఐఈఓ రమణి
ఉమ్మడి నల్లగొండ జిల్లా
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment