పక్కాగా చెత్తసేకరణ
ప్రైవేట్ సంస్థకు జీపీఎస్
పరికరాల బిగింపు బాధ్యతలు
జీపీఎస్ పరికరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. వాటి బిగింపు బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఒక్క జీపీఎస్ పరికరానికి రూ. 6 వేలకు పైగానే చెల్లిస్తున్నారు. పరికరాల బిగింపు సమయంలో 25 శాతం, బిగించిన తర్వాత 25 శాతం, ఏడాది తర్వాత 25 శాతం, రెండేళ్లకు 25 శాతం చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
హుజూర్‌నగర్ : మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు సూక్ష్యంగా పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా చెత్త సేకరణ వాహనాలైన ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, టిప్పర్లకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి టెండర్లు పూర్తి చేసి జీపీఎస్ పరికరాలు కూడా బిగించారు. దీంతో మున్సిపాలిటీల్లో వాహనాలు ఎక్కడ తిరిగి చెత్తను సేకరిస్తున్నాయో అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది.
107 వాహనాలకు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల ఉన్నాయి. వాటిలో మొత్తం 107 వాహనాలకు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిలో సూర్యాపేటలో చెత్త సేకరించే 40 ఆటో ట్రాలీలు, 12 ట్రాక్టర్లు, కోదాడలో 18 ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్లకు జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. హుజూర్‌నగర్‌లో 9 ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్లు, 2 వాటర్‌సప్‌లై ట్యాంకర్లు, తిరుమలగిరిలో 8 ఆటో ట్రాలీలు, రెండు ట్రాక్టర్లు, నేరేడుచర్లలో 5 ఆటో ట్రాలీలు, 2 ట్రాక్టర్లు, 1 వైకుంఠధామం వాహనానికి జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణలో టెక్నికల్ సిబ్బంది ఆయా వాహనాలకు పరికరాలు బిగించారు. మున్సిపల్ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నాయో ఎటు తిరుగుతున్నాయో సెల్‌ఫోన్‌లో స్పష్టంగా తెలుసుకోవచ్చు. పారిశుద్ధ్య సిబ్బంది తమకు కేటాయించిన రూట్లో వెళ్తున్నారా? ఎక్కడైనా వాహనాలు నిలిపి ఉంచారా? ఎన్ని ట్రిప్పులు చెత్త సేకరించారు? తదితర విషయాలు జీపీఎస్ ద్వారా తెలిసిపోతాయి.
తొలగించినవారిపై చర్యలు..
గతంలో జీపీఎస్ పరికరాలు బిగిస్తే కొందరు వాటిని తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని పని చేయకుండా చేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రైవేటు సంస్థ పర్యవేక్షణ ఉండటంతో వెంటనే మరమ్మతులు చేస్తారు. డ్రైవర్లు ఎవరైనా వాటిని పాడుచేసినా వాటిని తొలగించినా కఠిన చర్యలు ఉంటాయి.
తనిఖీ చేసే సమయం ఆదా అవుతుంది
మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలపై సూక్ష్మస్థాయి పరి శీలనకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. దీంతో వాహనాలు తనిఖీ చేసే సమయం ఆదా అవుతుంది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల పనిలో పారదర్శకత పెరుగుతుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయి. చెత్త సేకరణ కూడా పక్కాగా జరుగుతుంది. – కె. శ్రీనివాస్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్
మున్సిపాలిటీల్లో చెత్తసేకరణ వాహనాలకు జీపీఎస్
ఫ ఒక్కో పరికరానికి రూ.6వేలు ఖర్చు
ఫ వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం
ఫ కేటాయించిన రూట్లో పారిశుద్ధ్య సిబ్బంది వెళ్తున్నారా లేదా కనిపెట్టడానికి దోహదం
మున్సిపాలిటీ జీపీఎస్ బిగించిన
వాహనాలు
సూర్యాపేట 52
కోదాడ 22
హుజూర్‌నగర్ 15
తిరుమలగిరి 10
నేరేడుచర్ల 08
Comments
Please login to add a commentAdd a comment