ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌గా గగన మార్గన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌గా గగన మార్గన్‌

Published Sun, Jan 19 2025 1:38 AM | Last Updated on Sun, Jan 19 2025 1:38 AM

ఎడ్జ్

ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌గా గగన మార్గన్‌

తమిళసినిమా: జయం చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై ఆ చిత్ర విజయంతో వరుసగా చిత్రాలు చేస్తూ స్టార్‌ హీరోగా రాణిస్తున్న నటుడు జయం రవి. కోలీవుడ్‌లో స్మార్ట్‌ హీరోగా ముద్ర వేసుకున్న ఈయన తాజాగా నటించిన చిత్రం కాదలిక్క నేరమిల్లై. కాగా ఈయన సీనీ తదితర చిత్రాల్లో బిజీగా నటిస్తున్నారు. లేకపోతే జయం రవి ఇటీవల తన పేరును రవి మోహన్‌ గా మార్చుకున్నారు. అదేవిధంగా రవి మోహన్‌ స్టూడియోస్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సంస్థలో ఆయన స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించబోతున్నారన్నది తాజా సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో రవి మోహన్‌ తన కుమారుడు ఆరవ్‌ను ముఖ్యపాత్రలో నటింప జేస్తున్నట్లు తెలిసింది. ఆరవ్‌ ఇప్పటికే బాల నటుడుగా పరిచయమయ్యారు 2018లో రవి మోహన్‌ కథానాయకుడుగా శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించిన చిత్రం టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో ఆరవ్‌ రవి మోహన్‌ కు కొడుకుగా నటించాడన్నది గమనార్హం. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆరవ్‌ ను రవి మోహన్‌ మరో చిత్రంలో నటింప చేయలేదు. అలాంటిది తాజాగా తను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆరవ్‌ ను ముఖ్యపాత్రలో నటింపచేయనున్నట్లు తాజా సమాచారం. మరో విషెస్‌ ఏమిటంటే ఈ చిత్రానికి రవి మోహన్‌ తండ్రి సీనియర్‌ నిర్మాత ఎడిటర్‌ మోహన్‌ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు దర్శకుడు నిర్మాత అయిన విజయ్‌ ఆంటోని తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గగన మార్గన్‌. విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌, మీరా విజయ్‌ ఆంటోని కలిసి నిర్మిస్తున్న ఈ 12 వ చిత్రానికి విజయ్‌ ఆంటోని సంగీతాన్ని అందించడంతో పాటూ ఒక పాటను కూడా పా డడం విశేషం. కాగా ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్‌ లియో జాన్‌ పాల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు అజయ్‌ దిశా న్‌ పెద్ద నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌. యువ చాయగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఓ హత్య నేపథ్యంలో సాగే చిల్లర కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందన్నారు. ముఖ్యంగా విజయ్‌ అంటోని, అజయ్‌ దిశాన్‌ మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తాయన్నారు. ఆ విధంగా విజయ్‌ ఆంటోని సంగీతం బలమైన కథనాలు అన్నీ కలిపి గగన మార్గన్‌ ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కాగా విజయ్‌ ఆంటోని బాణీ లు కట్టి పాడిన సొల్లిడుమా..అనే పల్లవితో సాగే పాటను, టైటిల్‌ పోస్టర్‌ను పొంగల్‌ సందర్భంగా శుక్రవారం విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పాటకు సినీ ప్రియు ల నుంచి మంచి స్పందన వస్తుందనే ఆనందాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌గా గగన మార్గన్‌ 1
1/1

ఎడ్జ్‌ ఆఫ్‌ ది థ్రిల్లర్‌గా గగన మార్గన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement