నటుడు ధనుష్ చిత్ర విడుదల తేదీ మార్పు
తమిళసినిమా: నటుడు ధనుష్ బహుభాషా నటుడు బహుముఖ ప్రతిభావంతుడు అన్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన దర్శకుడు గానూ, నిర్మాతగానూ, గాయకుడు గానూ, గీత రచయితగాను సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన రాయన్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా హీరో దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం. ఈ చిత్రం ద్వారా ధనుష్ తన మేనల్లుడు పవీష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. నటి అనిక సురేంద్రనత, ప్రియా ప్రకాష్ వారియర్, మ్యాథ్యూ థామస్, వెంకటేష్ మేనన్, రవి ఖటూన్, రమ్య రంగనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో నటి ప్రియాంక మోహన్ ప్రత్యేక పాటలో నటించడం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విచిత్ర విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ కాగా చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే పొంగల్‌కు విడుదల కావలసిన అజిత్, త్రిష చిత్రం విడాముయర్చి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఫిబ్రవరి 6వ తేదీన చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీంతో నటుడు ధనుష్ తన చిత్ర విడుదలను ఫిబ్రవరి 21వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అజిత్ నటించిన విడాముయర్చి చిత్రం విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థనే కొనుగోలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment