వాలీబాల్ పోటీల విజేత జట్టుకు ట్రోఫీ బహూకరణ
పళ్లిపట్టు: సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వాలీ బాల్ పోటీల్లో విజేత జట్టుకు నటుడు విజయ్ పార్టీ శ్రేణులు ట్రోఫీతో సత్కరించారు. పళ్లిపట్టు సమీపం రామసముద్రం పంచాయతీలోని వీజీఆర్ కండ్రిగ గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆధ్వర్యంలో ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షత వాలీ బాల్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన పోటీల్లో పదికి పైబడి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుతో పాటు తొలి నాలుగు స్థానాలు సాదించిన జట్లకు ట్రోఫీతో పాటూ బహుమతి అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి నియోజకవర్గ అధ్యక్షుడు ఢిల్లీ, కార్య దర్శి లింగప్పన్, సంయుక్త కార్యదర్శి స్టాలిన్ తదితరులు పాల్గొని విజేతలకు ట్రోఫీతో పాటు బహుమతులు అందజేశారు. నటుడు విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment