టేకుమట్ల (రేగొండ): ఉపాధికి ఊతమిచ్చిన మోకు ఓ గీతకార్మికుడి పాలిట ఉరితాడై ఉసురు తీసింది. పొద్దున్నే ఇంటి నుంచి తాటివనానికి బయలుదేరిన అతడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన బండి కొమురెల్లి(58) అనే గీత కార్మికుడు కల్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం గ్రామ సమీపంలోని తాటి వనంలోకి వెళ్లి చెట్టు ఎక్కాడు. వర్షాలకు చెట్టు తడిసి ఉండటంతో కల్లు వంచుకుని కిందికి దిగే క్రమంలో మోకు పట్టుజారింది. దీంతో పైనుంచి కిందకు పడుతుండగా, అతని మెడకు ఉరి మాదిరిగా మోకు బిగుసుకుంది. దీంతో చెట్టుపైనే కొమురెల్లి ప్రాణాలు విడిచాడు.
చదవండి: పత్తి, మిరప సహా ఖరీదైన విత్తనాలతోనే అక్రమ వ్యాపారం
Comments
Please login to add a commentAdd a comment