![మోహిత్‌రెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/22cdr62-300076_mr_0.jpg.webp?itok=MZIqnIfh)
మోహిత్‌రెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు
● పేదరిక నిర్మూలనకు సంస్కరణలు ● ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ● గడపగడపకు మహాపాదయాత్రకు విశేష స్పందన
పాకాల: రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగనన్నతోనే సాధ్యమని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని కె.వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో 10వ రోజు గడపగడపకు మహా పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మగారిపల్లి, కంబాలమిట్ట, బీ.ఆర్.పల్లి, తోటి హరిజనవాడ, పోలిరెడ్డిపల్లిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న శరణార్థులకు మోహిత్‌రెడ్డి ఆర్థిక సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. చేసిన మేలు మరువం.. సాయం పొదాం.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొడుకుగా మీకు ఓటు వేసి రుణం తీర్చుకుంటాం.. అంటూ పల్లె ప్రజలు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆశీర్వదించారు.
అపూర్వ సాగతం
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆయా గ్రామాల్లో మోహిత్‌రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటా హారతులు పట్టారు. గజ మాలలతో సన్మానిస్తూ శాలువలతో సత్కరించారు. పూలపై నడిపించి అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా పేలుళ్లు, డప్పు మోతలు మార్మోగించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోహిత్‌రెడ్డి వెంట నడిచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేసిన లబ్ధిని మోహిత్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ బుక్‌లెట్‌ను అందజేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా..? అంటూ ఆరా తీశారు. వారు చెప్పిన వినతులు స్వీకరించి అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా చొర తీసుకున్నారు.
పేదరిక నిర్మూలనకు సంస్కరణలు
ప్రభుత్వ పథకాల ద్వారా అట్టడుగు వర్గాల అవసరాలను తీర్చి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగనన్న పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మోహిత్‌రెడ్డి గుర్తుచేశారు. అమ్మఒడి, నవరత్నాలు వంటి పథకాల ద్వారా ప్రభుత్వ ఫలాలను అందరికీ అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment