![నివాళులు అర్పిస్తున్న రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, కళాకారులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/20/19tpl31-300002_mr_0.jpg.webp?itok=K9QRhEC0)
నివాళులు అర్పిస్తున్న రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, కళాకారులు
తిరుపతి కల్చరల్: రాయలసీమ రవిశాస్త్రి పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్‌రెడ్డి, కార్యదర్శి కేఎన్.రాజా, కళాకారులు పొన్నాల జేజిరెడ్డి, టి.సుబ్రమణ్యంరెడ్డి, చెంగారెడ్డి, రవి, దీపక్, చెంగయ్య, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుచానూరు రోడ్డులోని నవజీవన్ బ్‌లైండ్ రిలీఫ్ సెంటర్‌లో 300 మందికి అన్నదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment