నిందితుల అరెస్ట్ చూపుతున్న అటవీ సిబ్బంది
– ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్
భాకరాపేట : మండలంలోని చిన్నగొట్టిగల్లు వద్ద ఆటోలో తరలిస్తున్న శ్రీగంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ రేంజర్ దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పీలేరు రహదారిలో వెళుతున్న ఆటోలో శ్రీగంధం తరలిస్తున్న సమాచారం అందగానే వెంబడించి సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆటోను స్వాధీనం చేసుకుని వక్కల సురేంద్ర, నరేంద్ర అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పట్టబడిన శ్రీగంధం విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని తెలిపారు. దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ తౌఫిక్‌ఇస్లాం, సదాశివయ్య, రాజేష్, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment