మట్టి ప్రతిమలు మేలు | - | Sakshi
Sakshi News home page

మట్టి ప్రతిమలు మేలు

Published Sat, Sep 7 2024 1:56 AM | Last Updated on Sat, Sep 7 2024 1:56 AM

మట్టి

తిరుపతి అర్బన్‌ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల వినియోగమే మేలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లావాసులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

10న ఉద్యోగ మేళా

శ్రీకాళహస్తి: పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 10వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్‌ ఎక్చ్సేంజ్‌, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ లలిత తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐఐటీ, డిప్లొమా, బీటెక్‌ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు ఆధార్‌, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్సులు, బయోడేటాతో రావాలని సూచించారు. ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 7989509540, 8919889609 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

13న టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి సమీపంలోని అగ్రహారం వద్ద ఈ నెల 13వ తేదీన టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అండర్‌–19 బాలబాలికల జిల్లా జట్లు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ మేరకు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ మాట్లాడుతూ 2005 తర్వాత జన్మించిన బాలబాలికలు పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94902 52821 నంబరులో సంప్రదించాలని సూచించారు.

వరద బాధితులకు రూ.36లక్షల విరాళం

తిరుపతి తుడా : ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలోని మెప్మా సంఘ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ. 36,14,078 విరాళంగా అందించారు. శుక్రవారం ఈ మేరకు మెప్మా పీడీ రాధమ్మకు చెక్‌ అందించారు. గుంటూరు మిషన్‌ డైరెక్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ ఖాతాలో నగదు జమ చేశారు.

మహిళా వర్సిటీలో ఈఈఈ అసోసియేషన్‌

తిరుపతి సిటీ : శ్రీపద్మావతి మహిళా వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈఈఈ విభాగం అసోసియేషన్‌ను శుక్రవారం ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ దేవేంద్రనాథ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈఈఈ అసోసియేషన్‌ ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ వీసీ వీరారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రెసిడెంట్‌ డి.హిమబిందు, ఉపాధ్యక్షులు నర్మిత, కార్యదర్శి పూజా, జాయింట్‌ సెక్రటరీలు జస్వంతి, సింధు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణం ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,142 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
మట్టి ప్రతిమలు మేలు 
1
1/2

మట్టి ప్రతిమలు మేలు

మట్టి ప్రతిమలు మేలు 
2
2/2

మట్టి ప్రతిమలు మేలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement