చట్ట పరిధిలో సహకార ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు

Published Thu, Oct 24 2024 1:33 AM | Last Updated on Thu, Oct 24 2024 1:33 AM

చట్ట

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు

తిరుపతి అర్బన్‌: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి చట్టపరిధిలోనే ఎన్నికలు జరుగుతాయని జిల్లా సహ కార అధికారి లక్ష్మి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన ఎన్నికల నిర్వహణకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరూ నియమావళిని పాటించాలన్నారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నాగభూషణం మాట్లాడుతూ ఎన్నికల నియమ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల అధికారి ఉమాపతి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉ దయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. తిరుమల ఎస్వీ హైస్కూ ల్‌లో 10 పోలింగ్‌ బూత్‌లు, తిరుపతి గోవిందరాజస్వామి హైస్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో 14 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. పోటీలో 35 మంది అభ్యర్థులున్నారని పేర్కొన్నారు. 6,349 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అసిస్టెంట్‌ రిజి స్ట్రార్‌ మద్దిపట్ల వెంకటరమణ పాల్గొన్నారు.

ఘనంగా జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌

నాయుడుపేట టౌన్‌ : పట్టణంలోని డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురుకులాల తిరుపతి, చిత్తూరు జిల్లా డీసీఓ పద్మజ అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలోని 10 గురుకులాలకు చెందిన విద్యార్థులు 166 సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించారు. సాయంత్రం వరకు జరగిన ఈ కార్యక్రమంలో జడ్జిలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు వ్యవహరించి, సైన్స్‌ఫేర్‌లో సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నలుగురు విజేతలను ఎంపిక చేసి, అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ దాదాఫీర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ నాగేశ్వరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌రఫీ, నెలవల రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌తో

ఎల్జీ పాలిమర్స్‌ ఎండీ భేటీ

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం శ్రీసిటీలోని ఎల్జీ పాలిమర్స్‌ విభాగానికి చెందిన ఎండీ మిస్టర్‌ లీ మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ను కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, తమ ఎల్జీ పాలిమర్స్‌ సమాచారాన్ని వివరించారు. ఆయనతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలున్నారు.

ముగిసిన పంచాంగ నిర్మాణ జాతీయ సదస్సు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ జ్యోతిష్య వాస్తు విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పంచాంగ నిర్మాణ జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఇందులో ముఖ్యఅతిథిగా బ్రహ్మశ్రీ రాణి నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నూతన శాసీ్త్రయ పరిశోధనలతో నూతన పంచాంగ నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. పలువురు జ్యోతిష్య విధ్వాంసులు, పంచాంగ కర్తలు పరిశోధనలు చేసి వర్సిటీ ఆధ్వర్యంలో నూతన పంచాంగ నిర్మాణం చేయాలనే సంకల్పం అభినందయమన్నారు. కార్యక్రమంలో వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, ప్రొఫెసర్‌ రాధాకాంత ఠాకూర్‌, డీన్లు రజనీకాంత్‌ శుక్ల, కృష్ణేశ్వర ఝా, కో–ఆర్డినేటర్స్‌ చిత్తరంజన్‌ నాయక్‌, కృష్ణ కుమార్‌ భార్గవ్‌, బాలాక్రామ్‌ సారస్వత్‌, ధర్మదాసన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చట్ట పరిధిలో సహకార ఎన్నికలు 1
1/3

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు 2
2/3

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు 3
3/3

చట్ట పరిధిలో సహకార ఎన్నికలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement