తిరుపతి అర్బన్: రబీ సీజన్ 2024–25కి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు పంట బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏఓ) ఎస్. ప్రసాద్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ వేరుశనగ, మామిడికి ఈ నెల 15 వరకు గడువు ఇచ్చామని, అయితే తాజాగా ఈ నెల 31 వరకు గడువు పొడిగించామని చెప్పారు. వరి పంటకు ఈ నెల 31 వరకు సమయం ఉందని తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి వరి పంటకు ఎకరానికి రూ.630 ప్రీమియం చెల్లించాలని చెప్పారు. వేరుశనగకు ఎకరానికి ప్రీమియం రూ.450 చెల్లించాలని తెలిపారు. మామిడి ఎకరానికి రూ.1,750 ప్రీమియం చెల్లించాలని చెప్పారు. వరి, వేరుశనగ పంటల బీమాను నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్(ఎన్‌సీఐపీ), మామిడి పంట బీమాను పీఎంఎఫ్‌పీవై పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
మెస్‌లో అగ్నిప్రమాదం
తిరుపతి క్రైం: నగరంలోని మధురనగర్ పరిధిలో ఉన్న ఓ మెస్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం సంఘటన గురువారం చోటు చేసుకుంది. అన్నిమాపక శాఖ అధికారులు కథనం మేరకు.. నాయుడు టిఫిన్ సెంటర్‌లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. అకస్మాత్తుగా మంటలు చెరగడంతో.. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.10 వేల విలువ చేసే సామగ్రి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
నలంద విద్యావిధానం
ఓ జీవన విధానం
తిరుపతి సిటీ: నలంద విశ్వవిద్యాలయ విద్యావిధానం ఓ జీవిత విధానం అని ఆ వర్సిటీ పూర్వ ఆచార్య మిట్టపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆంగ్లశాఖ ఆధ్వర్యంలో మాజీ వీసీ ప్రొఫెసర్ వీణనోబుల్‌దాస్ 7వ స్మారక ధర్మనిధి ఉపన్యాసం సావేరీ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అఫ్ రీసెర్చ్, తెలంగాణ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నలంద యూనివర్సిటీ పూర్వ ఆచార్యులు మిట్టపల్లి రాజేశ్వర్ వక్తగా వ్యవహరించి, ‘నలంద మోడల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ – 21 సెంచరీ కాంటెక్ట్స్’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆచరిస్తున్న జాతీయ విద్యా విధానంలో నలంద విశ్వవిద్యాలయం ఆచరిస్తున్న విద్యా విధానం నుంచి సంగ్రహించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. నలంద విశ్వవిద్యాలయ విద్యావిధానం అన్నది ఒక జీవిత విధానమని, 21వ శతాబ్దంలో అది ప్రతి ఒక్క విద్యావ్యవస్థ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సోషల్ సైన్సెస్ డీన్ సి వాణి, ఆంగ్ల విభాగధిపతి ఆచార్య శారద, హరిపద్మారాణి, నిర్మల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment