సౌత్‌జోన్ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
తిరుపతి సిటీ : కాలికట్ వేదికగా ఈనెల 21 నుంచి జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు ఎస్వీయూ పురుషల విభాగపు ఫుట్‌బాల్ జట్టును గురువారం అధికారులు ప్రకటించారు. ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల నుంచి ఫుట్‌బాల్ నందు పేరొందిన 20 మందితో కూడిన ఆటగాళ్ల బృందాన్ని అధికారులు ప్రకటించి వారికి టోర్నమెంట్‌కు అవసరమైన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ నజీరుద్ధీన్, కోచ్ సుదర్శన్, టీమ్ మేనేజర్ గఫూర్, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ శివశంకర్‌రెడ్డి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు.
దివ్యాంగ క్రికెట్ పోటీల నమోదుకు నేడు తుది గడువు
తిరుపతి సిటీ: త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి దివ్యాంగ క్రికెట్ పోటీలకు ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగ క్రికెట్ కమిటీ, ఏపీ దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ తేదీని ఈనెల 21న ప్రకటించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు చిత్తూరు జిల్లా కన్వీనర్ నాగరాజును 9985882559, 7780167625 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment