● పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం
బుచ్చినాయుడుకండ్రిగ: తన అన్న తొట్టంబేడు మండలం దొంగలముడురు గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ (40) మృతిపై తనకు అనుమానం ఉన్నట్లు తమ్ముడు భానుప్రసాద్ బుచ్చినాయుడుకండ్రిగ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్‌రావు సమక్షంలో పూడ్చిన మృతదేహన్ని వెలికితీసి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు కథనం మేరకు.. తొట్టంబేడు మండలం దొంగలముడురు గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల గ్రామ చెరువు వద్ద గత జూన్ 21వ తేదీన శవమై పడి ఉన్నాడు. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో క్రైస్తవ మత ఆచారంతో ఖననం చేశారు. అయితే అన్న మృతిపై తమ్ముడు భానుప్రసాద్‌కు అనుమానం రావడంతో బుచ్చినాయుడుకండ్రిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు గురువారం దొంగలముడురు గ్రామ శ్మశానంలో పూడ్చిన ఉదయ్‌కుమార్ శవాన్ని బయటకు తీసి, తహసీల్దార్ సమక్షంలో వైద్యులు హరిత, జ్యోతి ప్రసూన పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో నిజానిజాలను తెలుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment