జిల్లా విపత్తు సహాయనిధికి శ్రీసిటీ పరిశ్రమలు రూ. కోటి
● ఐలాకు అంబులెన్స్ వితరణ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): వరద సహాయక చర్యల్లో భాగంగా శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబం (సీఎస్‌ఆర్) సామాజిక బాధ్యతల్లో భాగంగా జిల్లా విపత్తు సహాయనిధికి శ్రీసిటీ పరిశ్రమలు రూ.కోటి విరాళం అందజేశాయి. ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సమక్షంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి విరాళం చెక్కును తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ, ఇతర పరిశ్రమల భాగస్వామ్య సమష్టి కృష్టిని డాక్టర్ యువరాజ్ ప్రశంసించారు. ఈ తరహా సాయం సామాజిక బాధ్యత, సమాజం సంక్షేమంపై కార్పొరేట్ రంగం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధులు ఈ ప్రాంతంలోని వరద బాధితులకు సకాలంలో సాయం అందించడంతో పాటు వారు తిరిగి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ చెప్పారు. బాధిత కుటుంబాలకు తన సంఘీభావం తెలియజేసిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి విపత్తు సహాయక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో శ్రీసిటీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉదార విరాళాలతో సహకరించిన పారిశ్రామిక భాగస్వాములందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి పాల్గొన్నారు.
టీహెచ్‌కే ఇండియా పరిశ్రమ చే అంబులెన్స్ విరాళం
కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా శ్రీసిటీలోని లీనియర్ మోషన్ గైడ్లను ఉత్పత్తి చేసే ప్రముఖ జపనీస్ పరిశ్రమ టీహెచ్‌కే ఇండియా రూ. 29లక్షల విలువైన అంబులెన్స్‌ను శ్రీసిటీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)కు వితరణగా అందజేశారు. ఈ వాహనాన్ని లాంఛనంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి ద్వారా ఐలాకు అందజేశారు.
అరగొండ అపోలోలో సర్జరీ విజయవంతం
తవణంపల్లి: మండలంలోని అర గొండ అపోలో హాస్పిటల్‌లో అత్యాధునిక విధానం ద్వారా షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ సర్జన్లు పమ్మి కార్తీక్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు గురువారం మండలంలోని అరగొండ అపోలో ఆస్పత్రిలో వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగే షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో నేడు నూతన శకం ఆరంభమైందన్నారు. అరగొండ అపోలో ఆస్పత్రిలో కూడా అత్యాధునిక విధానం అందుబాటులో ఉందన్నారు. ఈ సర్జరీలో నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని, రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment