యథేచ్ఛగా ప్రభుత్వ స్థలం ఆక్రమణ
పన్నీరు కాల్వ మార్గంలో వాగు పోరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణం
రేణిగుంట:రేణిగుంట మండలంలోని తిరుపతి –చైన్నె మార్గంలో ఉన్న తూకివాకం పంచాయతీ పన్నీరు కాల్వ గ్రామానికి వెళ్లే దారిలో విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. హైవే నుంచి పన్నీరుకాల్వ గ్రామానికి వెళ్లే దారిలో సర్వే నంబర్ 929లో 1.36 ఎకరాలు కాలువ పోరంబోకు స్థలం ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఇక్కడ అంకణం ధర రూ.1.5 లక్షలు పైనే పలుకుతోంది. దీంతో కొందరు ఈ విలువైన భూములపై కన్నేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణం పేరుతో నిర్మాణాలు చేపట్టారు. పక్కనే కొందరు గడ్డి వాములు వేసి ఆక్రమించుకున్నారు. మరి కొందరు ఆ విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండడంతో స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఈ అక్రమణలపై ఫిర్యాదు చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment