పుట్టాలమ్మ సేవలో అమెరికా బృందం
వరదయ్యపాళెం: మండలంలోని సంతవేలూరు గ్రామ దేవత పుట్టాలమ్మ ఆలయాన్ని అమెరికాలో ని టెక్సాస్‌కు చెందిన ప్రముఖ రోబోటిక్ హార్ట్ సర్జన్ డాక్టర్ అమిత్ కిషోర్, ఆయన బృందం శుక్రవారం దర్శించుకుంది. గతంలో పుట్టాలమ్మ ఆల య నిర్మాణ సందర్భంలో డాక్టర్ అమిత్ కిషోర్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పర్యటనలో భాగంగా సంతవేలూరు గ్రామానికి వచ్చి పుట్టాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆయన వివరించారు. ఆయన వెంట ఆలయ వ్యవస్థాపకులు, అమెరికా పౌరుడు డాక్టర్ మాయాని చెంచుమునస్వామి రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,165 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.60 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి: అనుమానాస్ప ద స్థితిలో వ్యక్తి మృతి చెంది న ఘటన శుక్రవారం రాత్రి తొట్టంబేడు మండలం, బోనుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల కథనం.. గ్రామానికి చెందిన జలగం ఆదెమ్మ కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయి. ఇటీవల బోనుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జలగం ఆదెమ్మ రెండో కుమారుడు జలగం మణి(52) శుక్రవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అయితే మణిపై ఎవరో దాడి చేయడం వల్లే మృతి చెందినట్లు ఆయన తమ్ముడు ఆనంద్ ఆరోపించారు. తాము వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని, రాజకీయ కక్షతోనే టీడీపీ నాయకులు తమపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. తనను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బోను పల్లికి వెళ్లకుండా చేశా రని ఆరోపించారు. ఈ విషయంపై తొట్టంబేడు ఎస్‌ఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా తమకు మృతుడి బంధువుల తరఫు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment