ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ, తిరుపతి మండల న్యాయ సేవ అధి కార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి శ్వేత భవనంలో గత ఐదు రోజులుగా న్యాయమూర్తులకు జరిగిన మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ శిక్షణ తరగతుల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన 30 మంది న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన మాజీ న్యాయమూర్తి హరీష్ దుడాని, మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ న్యాయమూర్తి గిరిబాలసింగ్ శిక్షణ ఇచ్చారు. వీరిని తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి జీ.రామ్‌గోపాల్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎంఎస్.భారతి పాల్గొన్నారు.
23న తిరుపతిలో
భక్త సమ్మేళన వేడుకలు
తిరుపతి కల్చరల్ : రామకృష్ణ–వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తిరుపతి– తిరుచానూరు రోడ్డులోని శ్రీనివాస కల్యాణ మండపంలో 6వ భక్త సమ్మేళనం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు స్వామి సుకృతానంద తెలిపారు. ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వేడుకల్లో దేశంలోని రామకృష్ణ మఠాలు, మిషన్లకు చెందిన 12 మంది ప్రముఖ స్వామీజీలు, మాతాజీలు పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment