రేణిగుంట: తొట్టంబేడు మండలం, బోనుపల్లి గ్రామంలోని జలగం మణి అనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు రాజకీయ వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బోనుపల్లికి చెందిన జలగం మణిని పోలీసులు రోజూ పోలీస్ స్టేషన్‌కి పిలిచి కొట్టి చిత్రహింసలు చేసినట్లు వారి కుటుంబసభ్యులు ఆవేదన చెందారన్నారు. బోనుపల్లి గ్రామానికి చెందిన భారతితో ఉన్న ఆస్తి తగాదాల కారణంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును సాకుగా తీసుకుని టీడీపీ నాయకులు రామానాయుడు, రవి, మరికొంతమంది కలిసి మణిని వేధించారని, అందుకు పోలీసుల సహకారం ఉండడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మృతుడు ఇల్లు ఖాళీ చేయమని బలవంత పెట్టటంతో అతను శుక్రవారం బలన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. శ్రీకాళహస్తి డీఎస్పీ టీడీపీ వాళ్లకు అనుకూలంగా పనిచేశారని అక్కడి గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment