ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
చంద్రగిరి: ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్‌ను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. శుక్రవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మార్కెటింగ్, పీఎంఈ పీ–ఎగ్జిబిషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్ ప్రాంతాల నుంచి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టా ల్స్‌ను కేవీఐసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కేవీఐసీ డిప్యూటీ సీఈఓ సౌత్ జోన్ మదనకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేవీఐసీ సంస్థ సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ కింద 1956లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా 26 డిపార్ట్‌మెంటల్ సేల్స్ ఔట్ లెట్స్, 88 వేల రిటైల్ సేల్స్ ఔట్ లెట్స్, 5 సెంట్రల్ ప్లాంట్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయన్నా రు. కేవీఐసీ రాష్ట్ర డైరెక్టర్ ఎస్.గ్రీప్, ఏడీ కోటిరెడ్డి, పద్మావతిపురం సర్పంచ్ జ్యోతి, లీడ్ బ్యాంకు మేనే జర్ విశ్వనాథరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment