ఇంటికే మద్యం బండి వచ్చిందోచ్!
చిట్టమూరు (చిల్లకూరు): సాధారణంగా కూరగాయలు, ఇతర సామగ్రిని ఆటోల ద్వారా వ్యాపారులు పల్లెల్లో విక్రయించడం చూస్తుంటాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికీ మద్యం పాలసీని అమలు చేస్తోంది. పల్లెల్లో ఆటోల ద్వారా విక్రయాలు చేసేలా ‘మద్యం బండి వచ్చిందోచ్’.. అని అనౌన్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే శుక్రవారం చిట్టమూరు మండలం, మొలకలపూడి గ్రామంలో చోటుచేసుకుంది. చిట్టమూరు మండలంలో నాలుగు మద్యం షాపులు ఉండగా అధికార పార్టి నాయకులు వాటిని దక్కించుకున్నారు. షాపుల్లో విక్రయాలు తక్కువగా ఉండడంతో సిండికేట్‌గా ఏర్పడి ప్రతి గ్రామంలో బెల్టు షాపులకు తెరలేపారు. ఇంకో వైపు ఆటోల్లో ఇంటింటికీ మద్యం పంపిణీ చేసేలా ఆటోల్లో గ్రామగ్రామానికీ తిప్పుతుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై వాకాడు ఎకై ్సజ్ సీఐ ప్రసాద్‌ను వివరణ కోరగా.. మొలకలపూడి గ్రామంలో ఆటోలో మద్యం విక్రయాలు చేశారన్న విషయం తమ దృష్టికి రాలేదని, విచారణ చేసి చర్యలు చేపడుతామని సెలవిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment