సందర్శకులకు ఇబ్బంది లేకుండా చర్యలు
దొరవారిసత్రం : రాష్ట్రప్రభుత్వం నేలపట్టు, పుట్‌కాట్ ప్రాంతాల్లో ఈనెల 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే పక్షుల పండుగ సమయంలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఏకే నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన ఆదివారం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన కేంద్రంలో విడిది చేసే విహంగాలను తిలకించారు. అదేవిధంగా పర్యావరణ కేంద్రం, పిల్లల పార్కులు, మార్గమధ్యలో పార్కులో ఉన్న జింకలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పక్షుల కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ఫారెస్ట్ అధికారులతో సమావేశమయ్యారు. పక్షుల పండుగ సమయంలో వచ్చే సందర్శకులు, పర్యాటకుల కోసం చేపట్టాల్సి ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో తిరుపతి సీఎఫ్ సెల్వం, నెల్లూరు, సూళ్లూరుపేట డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, హారిక, ఎఫ్‌ఆర్‌ఓ సౌజన్య, ఎఫ్‌ఎస్‌ఓ బాలయ్య, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment