పకడ్బందీగా గణతంత్ర ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వే దికగా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. శనివారం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఏర్పాట్లను పర్యావేక్షించారు. తిరుపతి ఆర్డీఓ రామమోహన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 11 శకరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 13 స్టాల్స్‌ను నిర్వహిస్తున్నారు. 8 సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. 986 మంది ఉద్యోగులకు ఉత్తమ సేవల నేపథ్యంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, డీఈఓ కుమార్, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య పాల్గొన్నారు.
తమ అనుకూలురకే అవార్డులా?
ఉత్తమ సేవలందించిన 990 మంది ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డులు ప్రదానం చేయనున్నారు. అందులో 38 మంది జిల్లా అధికారులకు అవార్డులను అందించనున్నారు. విభాగాల వారీగా అవార్డులకు ఎంపిక చేసే బాధ్యత ఆ విభాగానికి చెందిన ఓ జిల్లా అధికారికి అప్పగించారు. ఈ క్రమంలో ఉత్తమ సేవలందించిన వారికి కాకుండా తనకు అనుకూలంగా ఉన్నవారికి అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ పరేడ్‌లో కవాతు
తిరుపతి క్రైం: ఎంఆర్‌పల్లి సమీపంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో శనివారం కవాతు నిర్వహించారు. 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిహార్సల్స్ నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం డాగ్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
ఘనంగా ఓటర్ల దినోత్సవం
అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment