బుచ్చినాయుడుకండ్రిగ:కనమనంబేడు గ్రామంలోని ఏకలవ్య ఎస్టీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ ధర్మేంద్రసింగ్ తెలిపారు. గురుకులంలో సీబీఎస్‌సీ సిలబస్ చదువు చెబుతున్నామని, 6వ తరగతిలో చేరడానికి ఎస్టీ కులానికి చెందిన 30 మంది బాలికలు, 30 మంది బాలురు అవసరమని పేర్కొన్నారు. గత నెల 22 నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్ గురుకుల వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాత పరీక్ష ఈనెల 25వ తేదీన ఉంటుందని, వివరాలకు గురుకులం వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కోరారు.
కుంభమేళాకు ప్రత్యేక బస్సు
తిరుపతి అర్బన్: కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం 11000 సర్వీస్ నంబర్‌తో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డీసీటీఎం విశ్వనాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఈ నెల 7వ తేదీ అలాగే 14వ తేదీ రాత్రి 9 గంటలకు తిరుపతి బస్టాండ్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. పది రోజులు టూర్ ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తి రూ.10 వేలు టికెట్ ఉంటుందని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ (కుంభమేళా)తోపాటు వారణాసి, గయా, కోణార్క్ ప్రాంతాలను సందర్శించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే 30 మంది భక్తులు వచ్చి కుంభమేళాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment