● రణరంగంగా తిరుపతి నగర డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ● విధ్
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల బస్సును చుట్టుముట్టిన కూటమి గూండాలు
తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి గూండాలు రెచ్చిపోయారు. బలం లేని చోట బలగాన్ని వెంటబెట్టుకుని అరాచకానికి
ఒడిగట్టారు. ఓటేయడానికి బస్సులో వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మహిళా కార్పొరేటర్లపై అమానవీయంగా వ్యవహరించారు.
కొందరు కార్పొరేటర్లను బలవంతంగా లాక్కొచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
జర్నలిస్ట్‌లపైనా దాడికి తెగబడ్డారు.
పోలీసులు, అధికారుల సమక్షంలోనే ఎస్వీయూ ప్రాంగణంలో రణరంగం
సృష్టించారు. తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడేలా చేశారు.
తిరుపతి తుడా, తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారింది. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక మంగళవారానికి వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డెప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది. ఎన్నికల అధికారులు విధించిన నిబంధనలు కూటమి నేతలకు వర్తించలేదు. వర్సిటీ ప్రాంగణం టీడీపీ, జనసేన నేతలతో నిండిపోయింది. వైఎస్సార్‌సీపీ నేతలకు అడుగడుగునా తనిఖీలు తప్పలేదు. ఉదయం 6 గంటల నుంచే యూనివర్సిటీ పోలీసుల చక్రబంధంలోకి వెళ్లింది.
దాడులకు తలొగ్గని కార్పొరేటర్లు
డెప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏకంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ రంగంలోకి దిగారు. గడిచిన ఐదు రోజులుగా తిరుపతిలో తిష్టవేసి రాజకీయాలు నడిపించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. లొంగకపోవడంతో ఆస్తుల ధ్వంసానికి తెగబడ్డారు. ఈ క్రమంలో ముగ్గురు కార్పొరేటర్లు కూటమి పంచన చేరాల్సి వచ్చింది. అయితే మిగిలిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేన నేతల ఒత్తిళ్లు, దాడులకు తలవంచ లేదు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ బలాన్ని తగ్గించేందుకు కిడ్నాప్‌లకు తెరలేపారు. ఉదయం 8 నుంచి 21వ డివిజన్ కార్పొరేటర్ రాజమ్మ ఇంటివద్ద టీడీపీ నాయకులు దిష్ట వేశారు. అన్నా రామచంద్రయ్య, కార్పొరేటర్ అనిత, టీడీపీ నేతలు కోడారు బాల సుబ్రమణ్యం, బుల్లెట్ రమణ ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయా రు. ఆపై ఆమె తిరిగి వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే మరింత మంది కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి దౌర్జాన్యాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మెజారిటీ కార్పొరేటర్లు కౌన్సిల్‌లోకి వెళ్లేందుకు నిరాకరించి నిరసనకు దిగారు.
అంతా పోలీసుల సమక్షంలోనే
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వస్తున్న వాహనంపై విధ్వంసం, దాడులు, కిడ్నాప్‌లు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. టీడీపీ, జనసేన నేతలు గుమిగూడి, నానా హంగామా చేస్తున్నా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్ల కిడ్నాప్‌లు చేసినా చూసీచూనట్టు వదిలేశారు.
వర్సిటీలో రౌడీల హల్‌చల్
పోలీసులు ఎస్వీయూ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ విధించారు. పాస్‌లు పేరుతో హడావుడి సృష్టించారు. అయితే ఇవన్నీ ప్రతిపక్ష పార్టీకి మాత్రమే పోలీసులు వర్తింపజేశారు. టీడీపీ, జనసేన నాయకులు వందలాది మంది ఎన్నిక జరిగే భవనం ముందు తిష్టవేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మధన్ తన అనుచరులతో వర్సిటీ ప్రాంగణంలో హల్‌చల్ చేశారు. టీడీపీ, జనసేన నేతలకు ఎన్నికల అధికారులు విచ్చల విడిగా పాస్‌లు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకుడు నరసింహయాదవ్ పోలీసులను బెదిరిస్తూ కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లడం గమనార్హం.
బలవంతంగా వీడియోలు
ఎన్నిక నిర్వహణలో విఫలం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక్క డివిజన్‌ను టీడీపీ గెలుచుకుంది. 48 స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వశం చేసుకుంది. ఒక్క కార్పొరేటర్‌తో కూటమి ప్రభుత్వం డెప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని చేస్తున్న కుయుక్తుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెప్యూటీ మేయర్ ఎన్నికను సకాలంలో నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
కూటమి దౌర్జన్య కాండ
డెప్యూటీ మేయర్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంటి నుంచి ఉదయం 9.55 గంటలకు బయలు దేరారు. ప్రత్యేక వాహనంలో వస్తున్న కార్పొరేటర్లు ఎస్వీయూ రెండో గేటు వద్దకు చేరుకోగానే కూటమి నేతలు అడ్డుకున్నారు. అక్కడే ముందగా తిష్టవేసిన 300పైగా రౌడీమూకలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. బస్సు చక్రాలకు గాలితీశారు. వాహన అద్దాలను ధ్వంసం చేశారు. దాడులతో ఉలిక్కిపడ్డ మహిళా కార్పొరేటర్లు భయాందోళనకు గురయ్యారు. రౌడీ మూకల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వాహనంలోకి చొరబడి కార్పొరేటర్లపై పిడిగుద్దులు గుద్దుతూ తిట్లదండకం అందుకున్నారు. కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, బోకం అనిల్, అనీష్‌రాయల్, మోహన్ క్రిష్ణయాదవ్‌పై దాడులకు దిగారు. ఆపై సిద్ధంగా ఉన్న కూటమి నేతల వాహనాల్లో వారిని ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. మిగిలిన కార్పొరేటర్లలో ఐదుగురిని కొట్టుకుంటూ వాహనాల్లో ఎక్కించారు. మహిళా కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
కిడ్నాప్‌కు గురైన కార్పొరేటర్లపై దౌర్జన్యం చేసి వారి నుంచి బలవంతంగా వీడియోలను చేయించి విడుదల చేయించారు. 21వ డివిజన్ కార్పొరేటర్ రాజమ్మను స్పష్టంగా కిడ్నాప్ చేసిన దృశ్యాలు ఉన్నాయి. కానీ అన్నా అనిత కిడ్నాప్ కాలేదని వీడియో చేసి మీడియాకు విడుదల చేశారు. అలానే యూనివర్సిటీ వద్ద ఐదుగురు కార్పొరేటర్లను కిడ్నాప్‌చేసి ఒకరిని విడుదల చేశారు. నలుగురు కార్పొరేటర్లను ఫామ్ హౌజ్‌లో పెట్టి తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇళ్లవద్దే ఉన్నామని వీడియోలు చేయించి విడుదల చేశారు. ఈ వీడియోలు బలవంతంగా చేశారనే విషయం తేటతెల్లమవుతోంది. ఈ కుట్ర వెనుక అన్నా రామచంద్రయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment