తిరుపతి అర్బన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని.. ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన సోమవారం ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరల్ విద్యార్థులు 24,927 మందికి 124 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,355 మంది కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. విద్యార్థులు 20 నిమిషాలకు ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, సెంటర్లలో తప్పకుండా సీసీ కెమెరాలు ఉండాలని డీఆర్వో నరసింహులు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, డీఈఓ కేవీఎన్ కుమార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ రఘుపతి, రాజశేఖర్‌రెడ్డి, గోపాలరెడ్డి, రవి, విద్యుత్ శాఖ ఈఈ వాసవీలత, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment