సరస్వతీ నమస్తుభ్యం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో వసంతి పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద భక్తులు తమ చిన్నారులతో పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాల నడుమ అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ వసంత పంచమి రోజున చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయిచడం ఎంతో శుభకరమన్నారు. ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్, శ్రీచైనత్య, ఎంజీఎం తదితర పాఠశాలల్లో కూడా నర్సరీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు
Comments
Please login to add a commentAdd a comment