శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 59,784 మంది స్వామివారిని దర్శించుకోగా 20,740 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఎన్‌ఎస్‌యూ రిజిస్ట్రార్‌గా
వెంకటనారాయణ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా కడియం వెంకట నారాయణను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన డీఆర్‌డీఏ, సీఏబీఎన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో డైరెక్టర్‌గా, అడ్మిన్ ఆఫీసర్‌గా పలు హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, మాజీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రమశ్రీ,, అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన రిజిస్ట్రార్ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
అరకొర వేట!
వాకాడు: ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా సముద్రంలో కొత్త నీరు, అలజడి ఏర్పడి వేట సక్రమంగా సాగడం లేదని సంప్రదాయ మత్స్యకారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వాకాడు మండలం, కొండూరుపాళెం మత్స్యకారులు మాట్లాడుతూ ఒక్కో బోటులో ఒకరికి నలుగురు చొప్పున పొద్దు పొద్దస్తమానం సముద్రంలో గాలించినా పది, పదేహేను కిలోలకు మించి చేపలు దొరకడం లేదన్నారు. అదీ కూడా ఒకే రకం చేపలు దొరికితే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. అలా కాకుండా వివిధ రకాల చేపలు, పీతలు, రొయ్య లు, గుల్లలు, చెత్తా చెదారం దొరుకుతోందన్నారు. బోట్లకు డీజిల్ ఖర్చులు కూడా గిట్టుబాటు కావ డం లేదన్నారు.
ఒడ్డున ఉన్న బోట్లు
Comments
Please login to add a commentAdd a comment