![ఐఐటీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04skht201-300084_mr-1738695626-0.jpg.webp?itok=P6Ink-js)
ఐఐటీ సందర్శన
రేణిగుంట: భారత ఏకాత్మత యాత్రలో భాగంగా మంగళవారం ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల బృందం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని సందర్శించింది. విభిన్న ప్రాంతాలలో వివిధ జాతులు అవలంభించే సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 25మంది విద్యార్థులతో కూడిన బృందం ఐఐటీకి వచ్చింది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్.సత్యనారాయణ, ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ అండ్ అవుట్‌చీర్ యాక్టివిటీస్ డీన్ ప్రొఫెసర్ అరుణ్ తంగిరాల వారిని ఆహ్వానించారు. జాతీయ సమగ్రత, సాంస్కృతిక సమ్మేళనాల ప్రాముఖ్యతను వివరించారు. ఐఐటీ క్యాంపస్‌లో ల్యాబ్‌లు, ఆధునిక భవనాలు, సాంకేతికత మేళవించిన సౌకర్యాలను చూసి విద్యార్థుల బృందం ముగ్ధులయ్యారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మంగళవారం తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి ఆటోనగర్‌కు చెందిన మురళి, అతని భార్య శ్యామల, కుమార్తెలు హాసిని, హర్షిణి నెల్లూరు వెళ్లి తిరిగి బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన ఓ వ్యాపారి కుటుంబంతో నెల్లూరుకు బయలుదేరాడు. మార్గం మధ్యలోని తొట్టంబేడు మండలం బసవయ్యపాళెం వద్ద ఈ రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![ఐఐటీ సందర్శన
1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/05022025-tpt_dist-08_subgroupimage_1885616080_mr-1738695626-1.jpg)
ఐఐటీ సందర్శన
Comments
Please login to add a commentAdd a comment