కలబడినా..
వారం రోజులుగా ఆధ్యాత్మిక తిరుపతి నగరం అట్టుడికి పోయింది. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కాలకేయకూటమి చెలరేగిపోయింది. 48 మంది కార్పొరేటర్ల బలం కలిగిన వైఎస్సార్‌సీపీ వ్రేణులపై దాడికి తెగబడింది. వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించింది. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ భయాందోళనకు గురిచేసింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికారులను అడ్డం పెట్టుకుని మరీ చిత్ర హింసలకు శ్రీకారం చుట్టింది. సోమవారం ఓటేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై గూండాగిరి ప్రదర్శించింది. నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కలకలం సృష్టించింది. ఆపై మంగళవారం ఓటింగ్‌లో పాల్గొన్న ఆ కార్పొరేటర్లు కన్నీళ్లు పెట్టుకోవడం వారి అరాచకాలకు నిదర్శనంగా నిలిచింది. మహిళా మేయర్, కార్పొరేటర్ల వీరోచిత పోరాటం రాష్ట్ర ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచింది.
ఆదరిస్తూ..అండగా నిలుస్తూ!
వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి కార్పొరేటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడడాన్ని పలువురు ప్రసంసిస్తున్నారు. వారం రోజుల పాటు వారిని సురక్షితంగా తన నివాసానికి తీసుకొచ్చా రు. ఆపై వారి కుటుంబాలకు అండగా నిలిచారు. దాడులు, ప్రతి దాడులను ఎప్పటికప్పుడు ప్రతిఘటించారు. అదేవిధంగా మేయర్ డాక్టర్ శిరీష మహిళే అయినా.. గూండాలు ఎదురొచ్చి దాడులు చేస్తున్నా అధైర్యపడలేదు. మహిళా కార్పొరేటర్లకు ధైర్యం చెబుతూ వీరోచితంగా పోరాడారు. మరో కార్పొరేటర్ ఆరణి సంధ్య మహిళా కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ కూటమి నేతల బెదిరింపు కాల్స్‌ను తిప్పికొట్టారు. ఇలా ప్రతి మహిళా కార్పొరేటర్ తమదైన శైలిలో పోరాడి అభినందనలు అందుకున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కాలకేయ కూటమికి ఎదురొడ్డి పోరాడారు. నగరంలో వారం రోజులుగా కూటమి గూండాల అలజడులు.. అల్లర్లతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినా.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అదరలేదు.. బెదరలేదు. తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని సుమారు 500 మంది గూండాలు అడ్డుకుని రాడ్లు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నా చింతించలేదు. ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు ఎదిరించి వీరోచిత మహిళలనిపించుకున్నారు. పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్, కిరాయి రౌడీలందరినీ ఉపయోగించినా కుట్రలు పారలేదు.
కూటమి అరాచకాలకు ఆ కన్నీళ్లే సాక్ష్యం
తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాక కిడ్పాప్‌నకు గురైన వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ తిరిగి భూమన కరుణాకరరెడ్డి నివాసానికి విచ్చేశారు. జరిగిన తీరును వివరించారు. తమపై భౌతిక దాడులు చేస్తూ, ఆస్తులు విధ్వంసానికి పాల్పడిన నరకం చూపించారని అనీష్‌రాయల్ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. అనీష్ ఆవేదనను అర్థం చేసుకున్న భూమన కన్నీరు పెట్టుకోవడం చూసి కార్పొరేటర్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్‌లో అంతా కలసికట్టుగా పనిచేయడానికి వేదికగా మారిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభిప్రాయపడ్డారు.
కళ్లెదుటే అరాచకం సృష్టిస్తున్నా
అదరలేదు, బెదరలేదు
వీర సైనికులనిపించుకున్న
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
కూటమి గూండాలను ఎదిరించిన మహిళా కార్పొరేటర్లు
దొడ్డిదారిలో డెప్యూటీని లాక్కున్నా
నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే
వారం రోజులపాటు కూటమి గూండాలు వెంటాడినా చివరకు ఓటేశారు!
నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే
కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కొందరిని అధికారబలంతో బెదిరించి, భయపెట్టి ప్రలోభాలకు గురిచేశారు. దొడ్డిదారిలో డెప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బలమనుకోవద్దు!
తిరుపతి నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే. టీడీపీకి చెందిన ఒకే ఒక కార్పొరేటర్‌తో డెప్యూటీ మేయర్ స్థానాన్ని ఎలా దక్కించుకోగలుగుతారు..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార బలం, దాడులు, ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసులు, కిడ్నాప్‌లతో లోబరుచుకున్నారు. టీడీపీ గెలుపు చూసి తాము బలంతో గెలిచాం అనుకుంటున్నారు. ప్రజాకోర్టులో కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. – డాక్టర్ ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment