బాలికోన్నత పాఠశాలకు హరిత అవార్డు
నారాయణవనం: స్థానిక బాలికోన్నత పాఠశాలకు ఈ ఏడాది హరిత పాఠశాలగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు హెచ్‌ఎం శశికళ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ 2024–2025 విద్యాసంవత్సరానికి హరిత పాఠశాలగా జాతీయ స్థాయిలో ఎంపికై ందని తెలిపారు. ఇందులో వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలతో వర్షపు నీటి నిల్వ, వాడిన నీటిని మొక్కలకు పంపడం, విద్యుత్ ఆదా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. నేషనల్ గ్రీన్ కోర్, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డ్‌ను సంస్థ డైరెక్టర్ జనరల్ సునీత నరేన్ చేతుల మీదుగా పాఠశాల తరఫున జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్యామలత అందుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు డీఈఓ కుమార్, డిప్యూటీ డీఈఓ ప్రభాకర్ రాజులు ఫోన్‌లో అభినందించినట్టు వెల్లడించారు.
వామ్మో.. చిరుత!
తిరుపతి సిటీ: ఎస్వీయూ కేంద్రీయ లైబ్రరీ వెనుక చిరుత కనిపించినట్టు విద్యార్థులు మంగళవారం సాయంత్రం అటవీశాఖ అధికారులకు, వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి అధికారులు కేంద్రీయ గ్రంథాలయం వద్దకు చేరుకొని వాహనాలతోనే ఆ పొదల్లో పరిశీలించారు. చిరుత జాడ కనిపించ లేదు. అక్కడ గుమికూడిన విద్యార్థులను రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఫారెస్ట్ అధికారి సౌజన్య కలిసి, చిరుత వ్యవహార శైలి, ఆహార సేకరణపై అవగాహన కల్పించారు. హాస్టల్‌కు వేళ్లే సమయంలో విద్యార్థులు గుంపులుగా వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే వర్సిటీలో చిరుత కోసం ట్రాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలి పారు. అయితే వాటి వద్దకు విద్యార్థులు వెళ్లడం వల్ల మనిషి పాదముద్రల వాసన గ్రహించి ఆ ట్రాప్ వద్దకు చిరుత రాదని తెలిపారు. డీన్ ఎన్‌సీ.రాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment