![తిరుమలలో రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/03tml700_mr-1738610700-0.jpg.webp?itok=G1gl_fEe)
తిరుమలలో రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన
తిరుమల: తిరుమలలో మంగళవారం రథసప్తమి నిర్వహించనున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయ నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు పార్కింగ్ ప్రదేశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. భద్రతాపరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తిరుమలలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. భక్తులు ఎక్కువగా ఏ సమయంలో వస్తారో... గుర్తించి ఆ సమయంలో ప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రామకృష్ణ, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment