10న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
తిరుపతి అర్బన్: నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈ నెల 10న చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్‌తోపాటు వైద్యాధికారులతో కలసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 17న మాప్–ఆఫ్ డే నిర్వహణ ఉంటుందన్నారు. 1–19 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు అల్బెండోజోల్ 400 ఎంజీ ట్యాబ్లెట్లు అందిస్తారని చెప్పారు. డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్, డాక్టర్లు హరిత, పద్మావతి, అబిజ్ఞ, గుణశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment