రెండు బస్సులు ఢీ
– 15 మందికి గాయాలు
చిల్లకూరు: యాత్రలకు వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సును వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు తెలంగాణా రాష్ట్రంలోని జనగాం ప్రాంతానికి చెందిన 50 మంది పుణ్య క్షేత్రాలకు 15 రోజులు క్రితం వెళ్లారు. తిరిగి వెళ్తున్న క్రమంలో చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు –2 డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి నెల్లూరుకు వస్తూ ముందున్న యాత్రికుల ట్రావెల్ బస్సును వెనక నుంచి ఢీ కొంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తోపాటుగా రెండు బస్సుల్లో ఉన్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనాలు, స్వర్ణ టోల్ ప్లాజా అంబులెన్స్‌లలో క్షత గాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో జనగాం ప్రాంతానికి చెందిన శివకుమార్, వీరాస్వామి, యాకయ్య, కలమ్మలతోపాటుగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే ఆర్టీసీ బస్సులో తిరుపతి నుంచి నెల్లూరుకు ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్, చిత్తూరుకు చెందిన హేమంత్‌కుమార్, పీలేరు ప్రాంతం చెరువు కింద పల్లికి చెందిన జయరామయ్య, శ్రీకాళహస్తికి చెందిన పద్మమ్మ, నెల్లూరుకు చెందిన షకీలాకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment