![డక్కిలిలో టీడీపీ నేతల దాష్టీకం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07vgr82-410002_mr-1738955358-0.jpg.webp?itok=L2ySW1vK)
డక్కిలిలో టీడీపీ నేతల దాష్టీకం
● వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి యత్నం ● భయాందోళనకు గురైన ఏపీడీ
డక్కిలి: డక్కిలిలో ఉపాధి అక్రమాలు బయటపెట్టడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి యత్నించారు. దీంతో విచారణ అధికారి ఏపీడీ భయాందోళనకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. డక్కిలిలో ఉపాధి అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బోగస్ మస్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, బయట ప్రాంతాల్లో ఉన్న వారు, హైస్కూల్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్లను ఉపాధి కూలీలుగా చూపించి బిల్లులు పెట్టిన వైనాన్ని ఎండగట్టారు. ఈ మేరకు శుక్రవారం డక్కిలి సచివాయలంలో ఏపీడీ వరప్రసాద్ బహిరంగ విచారణ చేపట్టారు. విచారణలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. తమ తప్పులు ఎక్కడ బయటపడుతాయోనని ఫిర్యాదుదారులైన వైఎస్సార్‌సీపీ నాయకులు మాదిరెడ్డి మునిరామ్‌రెడ్డి, డక్కిలి మురళీరెడ్డి, మునిరెడ్డి, రవీంద్రారెడ్డిపై దాడి కి యత్నించారు. టీడీపీ నాయకులైన డక్కిలి సునీల్‌రెడ్డి, దందోలు పెంచలరెడ్డి, పోట్టేళ్ల శ్రీనివాసులు, పిల్లి శ్రీనివాసులురెడ్డి తీరుతో విచారణ అధికారి సైతం భయాందోళనకు గురయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు లు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసు లు ఇరు వర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించా రు. అనంతరం ఏపీడీ సమగ్ర నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment