![వెబ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/tpthead_mr-1738955464-0.jpg.webp?itok=ETgWdadq)
వెబ్‌సైట్లో ప్రాక్టికల్స్ హాల్ టికెట్లు
భోజనంలో జెర్రి
ఎస్వీయూలోని ఏ మెస్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థికి వడ్డించిన ప్లేట్‌లో జెర్రి ప్రత్యక్షమైంది.
వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
వెటర్నరీలోని జూడాలు ఐదో రోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్టైఫెండ్ పెంచే వరకు నిరసన ఆపేది లేదన్నారు.
శనివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతి జిల్లా పోలీసు అధికారులు అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. ఇటీవల తిరుపతిలో చోటు చేసుకున్న వరుస సంఘటనలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా జిల్లా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు ఉదాహరణ ఇటీవలే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తలెత్తిన వివాదమే.
అంతటా వైఫల్యమే!
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కూటమి నేతలు చిత్రహింసలకు గురిచేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదు. ఆపై రెండో రోజు ఓటేసేందుకు ఎస్వీయూ సెనేట్ హాల్‌కు బస్సులో వెళ్తుండగా కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్నా చోద్యం చూడడం విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను స్థానికక ప్రజాప్రతినిధి కొడుకు, కూటమి నేతలు బెదిరించడంతో పాటు కిడ్నాప్ చేశారు. వారి చెర నుంచి విడిపించేందుకు వెళ్లిన తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, ఇతర నాయకులపై దాడికి తెగబడ్డారు. కానీ వారిని అడ్డుకోకపోగా ప్రేక్షకపాత్ర పోషించారు. సజావుగా జరగాల్సిన డెప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఘర్షణలకు దారితీసింది.
అధికారం శాశ్వతం కాదు బాసూ!
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని తెలిసినా పోలీసులు కూటమి నేతల సేవలో తరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి జరిగే వకాశం ఉందని ముందే తెలిసినా స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇదే అదునుగా కూటమి నేతలు రెచ్చిపోయారు. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై కూటమి రౌడీలు దాడులకు తెగబడ్డారు. అక్కడే ఉన్న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ చూసీచూడనట్లు వ్యవహరించారు. సీఐలు, ఎస్‌ఐలు తమకెందుకులే అన్న రీతిలో ఉండిపోయారు.
తిరుపతిని వెంటాడుతున్న వరుస ఘటనలు!
ఆధ్యాత్మిక తిరుపతిలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది. ఇటీవల తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. దీని వెనుక స్పెషల్ బ్రాంచ్ విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత నెలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు కూడా పోలీసుల భద్రతా వైఫల్యమే కారణమని తేటతెల్లమైంది. వీరు ముందే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఇన్ని ఘటనలు జరిగేవి కావని కొందరు పోలీసులే చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ముందే పసిగట్టే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది చేతగానితనం కనిపించింది. మరోవైపు డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరగబోయే ఘటనలపై ఎస్పీకి కూడా చెప్పలేక పోయారు. యూనివర్సిటీ ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరిల్లాయి. లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అక్కడే ఉన్నా ఫలితం లేకపోయింది. సినిమాల్లో లాగానే జరగాల్సిన నష్టం అంతా జరిగాక పోలీసులు వచ్చినట్లు ఎస్పీ కూడా నింపాదిగా రావడం విమర్శలకు తావిచ్చింది.
నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికల స్వీయ రక్షణకు కరాటే, థైక్వాండ్ తదితర రక్షణ కల్పించే అంశాలపై శిక్షణ ఇవ్వడానికి మాస్టర్స్‌ను ఎంపిక చేయనున్నట్టు డీఈఓ కేవీఎస్ కుమార్ శుక్రవారం పేర్కొన్నారు. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ ఆత్మరక్షణ అనే కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక గుర్తింపు పొందిన సొసైటీలు, లేదా సంస్థల పరిధిలో మూడేళ్ల పాటు అనుభవం కల్గిన మాస్టర్స్‌ను శిక్షణ ఇవ్వడానికి ఎంపిక కోసం ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా కళాశాల లాగిన్‌లోను, అలాగే ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ అనే వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నం.95523 00009 ద్వారానూ హాల్‌టెకెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్‌ఐఓ తెలిపారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
కూటమి సేవలో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం
శాంతి భద్రతలను గాలికొదిలేసిన ఖాకీలు
ఏడుకొండల వెంకన్న సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికలో బయటపడిన స్వామిభక్తి
విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు
దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం
ప్రత్యేక నిఘా విభాగం, విజిలెన్స్ పూర్తి విఫలం
భయభ్రాంతులకు గురవుతున్న జిల్లా ప్రజానీకం
జిల్లాలో రక్షక భటులే భక్షకులైపోయారు. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు గులామయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్‌గా చేసుకుని చెలరేగుతున్నా తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వరుస దొంగతనాలు, తొక్కిసలాటలు జరుగుతున్నా తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడంలో విఫలమవుతున్నారు. పర్యవసానంగా తిరుపతి జిల్లా ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఎక్కడ చూసినా గంజాయి విక్రయాలే
జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొందరు ఆటో వాలాలు కూడా గంజాయి విక్రయిస్తున్నారు. దీనికితోడు తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు నగర శివార్లలో భారీగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా, క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు. తిరుపతిలో యువత గంజాయి మత్తులో జోగుతున్నా పట్టించుకునే నాథుడేలేరు. పోలీసులకు మామూళ్లు అందుతుండడంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
భారీ చోరీలు జరిగినా..!
గత ప్రభుత్వంలో తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తిరుపతి రూరల్‌లోని సీపీఆర్ విల్లాస్‌లో నాలుగు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. సుమారు 1.48 కేజీల బంగారు, రూ.లక్షల్లో నగదు చోరీ జరిగినా.. ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తడంపై చూపే శ్రద్ధ ప్రజల రక్షణపై పెడితే బాగుంటుందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
తిరుపతిలో వరుసగా వైఫల్యాలు!
ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో శాంతి భద్రతలు గాడితప్పాయి. నెలరోజుల వ్యవధిలోనే దేశం అంతా తిరుపతి వైపు చూసేలా చేయడంలో పోలీసుల వైఫల్యమే అనడంలో సందేహం లేదు. ప్ర జాప్రతినిధులవేనా ప్రాణాలు..? ప్రజలవి ప్రా ణాలు కాదా ? అని సగటు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ కూటమి నాయకుల సేవలో తరిస్తారా ? అని నిట్టూరుస్తున్నారు. అధికార పా ర్టీ నేతల సేవలో తరిస్తే కావాల్సినవి వచ్చి చేరు తాయి. పోస్టింగుకు ఇబ్బంది ఉండదనే భ్రమలో చాలామంది పోలీసులు వ్యవహరిస్తున్నారు.
![వెబ్‌సైట్లో ప్రాక్టికల్స్ హాల్ టికెట్లు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/08022025-tpt_dist-07_subgroupimage_1880175136_mr-1738955464-1.jpg)
వెబ్‌సైట్లో ప్రాక్టికల్స్ హాల్ టికెట్లు
Comments
Please login to add a commentAdd a comment