తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో నలుగురికి ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... 2011 ఆగస్టు 13న రుద్రవరం ఫారెస్ట్ అధికారులు తెలుగు గంగ కాలువ, పెద్ద వంగిలి బీట్, చిన్న బండ్లశాల అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం, ఆల మూరుకు చెందిన జీ.వెంకటరమణ, పీ.నరసింహులు, ఏ.మద్దిలేటి, షేక్ హుస్సేన్, పీ.ప్రసాద్ తొ మ్మిది ఎరచ్రందనం దుంగలను నరికి నాలుగు దుంగలను భుజాలపై తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అరె స్ట్ చేసి ఆళ్లగడ్డ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నేరం ఐదుగురిపై రుజు వు కావడంతో న్యాయమూర్తి ఐదుగురికీ శిక్ష విధి స్తూ 2020 ఫిబ్రవరి 13న తీర్పు చెప్పారు. ఆ తీర్పు పై ఐదుగురు రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ కోర్టులో అప్పిలు దాఖలు చేసుకున్నారు. కేసు విచా రణ దశలో ఐదో నిందితుడిగా ఉన్న పీ.ప్రసాద్ మృతి చెందాడు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ నలుగురికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కోటేశ్వర్‌రెడ్డి వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment