![వెటర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/gold1_mr-1738955356-0.jpg.webp?itok=fAgPWjW_)
వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో జూడా ల సమ్మె ఐదో రోజుకు చేరింది. ఇందులో భా గంగా శుక్రవారం విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వర్సిటీ ఆవరణలోని గ్రౌండ్‌లో ‘ఉయ్ వాంట్ జస్టీస్’ అంటూ నల్లదుస్తులు, వైట్ యాప్రాన్లను ధరించి వెటర్నరీ వైద్య లోగో ఆకారంలో కూర్చొని తమ నిరసనను తెలియజేశారు. గౌరవేతనాన్ని వెంటనే పెంచాలని, అన్ని వైద్య విభాగాల్లో ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు అందజేస్తున్న స్టైఫండ్‌తో సమానంగా తమకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానిని కలసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
కారు ఢీకొని కూలీ మృతి
పెళ్లకూరు: కారు ఢీకొ ని వ్యవసాయ కూలీ మృతిచెందిన ఘటన నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహ దారి టెంకాయతోపు గ్రామం వద్ద శుక్రవా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. రావులపాడు దళిత వాడకు చెందిన వెంకటరత్నం(58) వ్యవసాయ పనుల నిమిత్తం టెంకాయతోపు వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళతున్న కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
బంగారం :
24 క్యారెట్లు 10 గ్రాములు రూ.87,520
22 క్యారెట్లు ఒక గ్రాము రూ.7,930
వెండి:
హోల్‌సేల్ ధర (కిలో) రూ.98,800
రిటైల్ వెండి గ్రాము రూ.101.80
క్లుప్తంగా
![వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07tpl12-300115_mr-1738955357-1.jpg)
వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
![వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07slp101-410018_mr-1738955357-2.jpg)
వెటర్నరీ జూడాల వినూత్న నిరసన
Comments
Please login to add a commentAdd a comment