No Headline
పరిగి: ఎలాంటి పత్రాలు లేకుండా జాంబియా దేశానికి అక్రమంగా తరలిస్తున్న బోర్‌వెల్ వాహనాన్ని పరిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పట్టణ పరిధిలోని కొడంగల్ చౌరస్తాలో ఆదివారం అర్ధ రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నంబరు ప్లేటు లేని బోర్‌వెల్ వాహనం రావడంతో పోలీసులు ఆపి వివరాల అడిగారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను విచారించగా బోర్‌వెల్ బండిని నగరానికి తరలించి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా ముంబైకి అక్కడి పోర్టు ద్వారా జాంబీయా దేశానికి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ప్రతి నెలా 45 వాహనాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి పత్రాలు లేకుండా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా వాహనాలను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వాహనాన్ని పరిగి ఎంవీఐకి అప్పజెప్పనట్లు ఎస్‌ఐ తెలిపారు. వాహనాల అక్రమ రవాణాపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment