గ్రూప్–3కి పకడ్బందీ ఏర్పాట్లు
అనంతగిరి: జిల్లాలో గ్రూప్–3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు జరుగుతాయని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు ప్రతి కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఫర్నిచర్, కనీస వసతులు ఉండాలని తెలిపారు. 17వ తేదీ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 18వ తేదీ మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం 9.30 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్లు మాత్రమే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవచ్చని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశ్న పత్రాలు, ఇతర సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్లకు తరలించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సూపరింటెండెంట్ నేహమత్ ఆలి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment