సర్వేకు సహకరించాలి
అడిషనల్ కలెక్టర్ సుధీర్
అనంతగిరి: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండలస్థాయి అధికారులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్లు, ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు సిద్ధం కావాలన్నారు. మొక్కలు పెంచేందుకు అవసరమైన మట్టిని సేకరించుకోవాలని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఉపాధి హామీ పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈఓ బాబుసింగ్, ఎంపీఓ దయానంద్, ఏఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment