చదువుకుంటేనే భవిష్యత్
అనంతగిరి: అమ్మాయిలు సమాజంలో రాణించాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చక్కటి వ్యాసం రాసిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన సుప్రియను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు అబ్బాయి, అమ్మాయిలను సమానంగా చూడాలన్నారు. బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. అమ్మాయిల భద్రత అందరి బాధ్యత అన్నారు. చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ఎడ్ న్యాయవాదులు వెంకటేశం, రాము, న్యాయవాది ఏ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, వీరేశం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment