గ్రామాలాభివృద్ధికి కృషి
వికారాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 100 శాతం సీసీ రోడ్లను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నవాబుపేట మండల పరిధిలోని చించల్పేట గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను 100 శాతం వేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో గ్రామాలన్ని అభివృద్ధి వైపు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సీఎసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీడీఓ అనురాధ, నాయకులు రాజశేఖర్రెడ్డి, ఖదీర్, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment