ఇద్దరిపై కేసు నమోదు
కుల్కచర్ల: అటవీశాఖ భూమిలో బోరు వేయించిన ఇద్దరిపై కేసు నమోదు చేశారని ఫారెస్ట్ అధికారి సాయికుమార్ తెలిపారు. కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చిల్ల రామకృష్ణ, సున్నల దస్తయ్యల సూచనల ప్రకారం బోరుబండి నిర్వాహకులు సోమవా రం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా అటవీశాఖ భూమిలో బోరు వేశారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ ని సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్ పేర్కొన్నారు.
వైన్స్‌లో చోరీకి యత్నం
దోమ: కొందరు దుండగులు వైన్స్ దుకాణాలనే టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు యత్నిస్తున్నారు. దోమ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ దుకాణానికి సోమవారం రాత్రి సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో దుండగులు వైన్స్‌లో చోరీ చేసేందుకు అర్ధరాత్రి సమయంలో యత్నించారు. ముందుబాగంలో ఉన్న గ్రిల్స్‌కు ఉన్న తాళాలను పగలగొట్టి షెట్టర్ తాళాలను విరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ అవి ఓపెన్ కాపోవడంతో దుండగలు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం వైన్స్‌కు వెళ్లిన సిబ్బందికి గ్రిల్స్ తాళాలు విరగొట్టడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైలు కింద పడి
మహిళ ఆత్మహత్య
తాండూరు టౌన్: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన మంగళవారం తాండూరు రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 40 ఏళ్ల వయసున్న ఓ మహిళ సాయంత్రం తాండూరు మీదుగా వైజాగ్ వెళ్తున్న ఎల్‌టీటీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏఎస్పీ రవీందర్‌రెడ్డి బదిలీ
అనంతగిరి: వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. కాగా ఆయన స్థానంలో జిల్లా ఏఎస్పీగా హైదరాబాద్ సిటీ వెస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న టీవీ హనుమంతరావును నియమించింది. కాగా రవీందర్‌రెడ్డిని హైదరాబాద్ సిటీ సీసీఎస్, ఈఓడబ్ల్యూ విభాగంలో అడిషనల్ డీసీపీగా బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment