ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Published Wed, Nov 27 2024 7:16 AM | Last Updated on Wed, Nov 27 2024 7:16 AM

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

తాండూరు రూరల్‌: ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తాండూరులోని జిల్లా ఆస్పత్రి వైద్యురాలు రుబియానాజ్‌ సూచించారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌ పృథీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ.. హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. పురుగుల అన్నం వడ్డిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వంట సామగ్రి, పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తర్వాత విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వినోద్‌ ఖన్నా, వైద్య సిబ్బంది ప్రమీల, కృష్ణవేణి, కళాశాల కో ఆర్డినేటర్‌ సురేష్‌, స్కూల్‌ కో ఆర్డినేటర్‌ మహబూబ్‌, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

జిల్లా ఆస్పత్రి వైద్యురాలు రుబియానాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement