తాండూరు రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రాంతంలో జరిగే అభివృద్ధి తరహాలోనే తాండూరును ప్రగతిపథంలో తీసుకెళ్లానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గోనూర్‌లో ప్రజా విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్పొరేట్ తరహా మెరుగైన విద్యను అందించేందుకు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందన్నారు. అనంతరం బోనమ్మ గుడి నుంచి అగ్గనూర్ శివారు వరకు రూ.15 లక్షలతో ఫార్మెషన్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, ఎంపీడీఓ విశ్వప్రసాద్, అడిషనల్ సీడీపీఓ శ్రీలక్ష్మీ, నాయకులు ఉత్తమ్‌చందు, రాందాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బోనమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
తాండూరు: పాత తాండూరు ప్రాంతంలో ఉన్న బోనమ్మ(భవానిమాత) దేవాలయ జాతరలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్‌లు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment