ఓటు వజ్రాయుధం లాంటిది
తాండూరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, విద్యార్థులతో కలిసి 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి విలియంమూన్ మైదానం వరకు 2కే రన్ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసుపై బడిన యువకులు ఓటు హక్కును పొందాలన్నారు. ప్రజలకు ఓటు అనేది ఒక వజ్రాయుధమన్నారు. ఓటుహక్కును రాజ్యాంగం మనకు కల్పించిన హక్కన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, మేనేజర్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓటు హక్కు కీలకం
పరిగి: ఓటు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. స్వీప్ ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమం నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పరిపాలన విధంగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి తమ ఓటును వేయాలన్నారు. ప్రజాస్వామ్యంతో ఓటు హక్కుకు ఉన్న విలువ దేనికి లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాశంకర్
Comments
Please login to add a commentAdd a comment