![తట్టె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17vkb93-360018_mr-1734488323-0.jpg.webp?itok=EZ-ZwpMp)
తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి
శాసన సభలో ప్రస్తావించిన
తాండూరు ఎమ్మెల్యే బీఎంఆర్
తాండూరు: తాండూరు నియజకవర్గంలో తట్టెపల్లి మండలంగా ఏర్పాటు చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రస్తావించారు. ఉదయం సెషన్‌లో రెవెన్యూ శాఖ చర్చ కొనసాగుతుండగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవకర్గంలోని పెద్దేముల్ మండల పరిధిలో ఉన్న తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఎన్నో రోజులు రిలే దీక్షలు చేశారు. ప్రజల అభీష్టం మేరకు తట్టెపల్లిని మండలంగా మార్చాలని రెవెన్యూ శాఖ మంత్రి కోరుతున్నానని అన్నారు. తట్టెపల్లి మండలంగా మార్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు
ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
అనంతగిరి: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళ శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు ఇస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి హన్మంతురావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున ఈ నెల 31 వరకు ముస్లింలు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పారిస్‌లు ఆన్‌లైన్‌లో టీజీఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ హార్డు కాపీని కలెక్టరేట్ ఆవరణలోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. వివరాలకు 7993357103 నంబర్‌లో సంప్రదించాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు 18–55 ఏళ్ల మధ్యనున్న మహిళలు తెల్లరేషన్ కార్డుతో పాటుగా గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణాల వారికి రూ.2లక్షల లోపు మించకుండా ఆదాయ ధృవపత్రం ఉండాలన్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి టైలరింగ్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఐదవ తరగతి కనీస విద్యార్హత ఉండాలని సూచించారు.
పెన్షన్.. సేవలకు చెల్లింపు
విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు
అనంతగిరి: పెన్షన్ బహుమానం కాదని.. గతంలో అందించిన సేవలకు చెల్లింపని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు అన్నారు. మంగళవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లోని శ్రీసత్యసాయి జ్ఞాన కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా మాణిక్ ప్రభు మాట్లాడుతూ.. ధరం స్వరూప్ నకార పెన్షనర్ల ఆత్మగౌరవానికి పోరాడిన మహనీయుడు అన్నారు. విశ్రాంత ఉద్యోగులు కుటుంబానికి తాళం చెవిలాంటి వారన్నారు. పెన్షనర్లకు కాకిలాంటి కలుపుగోలుతనం, భగవంతుడిపై ఏకాగ్రత, తగినంత ఆహారం తదితర లక్షణాలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా 73 సంవత్సరాలు నిండిన పదిమంది పెన్షనర్లకు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం ప్రతినిధులు బెంజిమెన్, బందెప్పగౌడ్, శ్రీహరి, కిష్టయ్య, సతీష్‌చంద్ర, విజయరావు, విఠోబా, అలీమోద్దీన్, మొగులయ్య, జనార్ధన్, సాయన్న, మనోహర్, విద్యాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీచర్లకు వేతనాలు
మంజూరు చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించి ఆదుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు మంగళవారం కలెక్టరేట్‌లో డీటీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో చేరి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కొత్త జీతం అందుకునే ఆనందానికి దూరమయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిషన్‌నాయక్, ఇతర నాయకులు శంకర్ నాయక్, బొడ్డుపల్లి రాములయ్య, జహీర్ అజాద్, జె.కృష్ణ, పబ్బతి ఆంజజేయులు తదితరులు పాల్గొన్నారు.
![తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి 1](https://www.sakshi.com/gallery_images/2024/12/18/17tnd01-360003_mr-1734488324-1.jpg)
తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment