పట్టువిడవని ఎస్‌ఎస్‌ఏలు
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం 12వ రోజుకు చేరింది. వికారాబాద్‌లోని ఆర్‌డీఓ కార్యాలయం ఎదట చేపట్టిన సమ్మెలో భాగంగా బీజేఆర్ చౌరస్తాలో మావనహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కేతావత్ గాంగ్యానాయక్ మాట్లాడుతూ 2023లో తాము సమ్మె చేస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమను రెగ్యులర్ చేయాలన్నారు. విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో కీలకంగా పనిచేస్తూ విద్యా వ్యవస్థ విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన గత 21 ఏళ్లుగా విధులను నిర్వహిస్తున్నామన్నారు. స్వరాష్ట్రంలోనూ పదేళ్లుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా తమ ఊసెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేస్తూ ఉద్యోగులందరికి రెగ్యులర్ చేయాలని లేనిపక్షంలో పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఆయా విభాగాల ముఖ్య నాయకులు శేఖర్, రవికుమార్, ప్రభావతి, రాజేశ్వరి, స్వరూప, స్రవంతి, ఆశాలతా, మంగమ్మ, పల్లవి, శైలజ, రాధిక, వెంకట్‌రెడ్డి, రఘు, మోహన్, మీన, దశరథ్, రవి, చంద్రశేఖర్, విజయ్, వేణుగోపాల్, కృష్ణవేని, జ్యోతి, ఇందిరా జిల్లాలోని సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
12వ రోజుకు చేరిన సమ్మె
Comments
Please login to add a commentAdd a comment